Indian women footballers badly treated by authorities, alleges former captain Sona Chaudhary

Game in game has 90 percent facts says sona chaudhary

AIFF, All India Football Federation, Game in Game, India women's football team, Indian Football, KickingAround, Sona Chaudhary, Women's Football

Former India women's football team captain Sona Chaudhary, who has made serious allegations against the sport's administrators in her recently launched book, said the female players were treated badly during her playing days.

అది పుస్తకం కాదు.. అనుభవించిన వాస్తవాలు.. 90 శాతం నిజాలే..

Posted: 05/12/2016 05:47 PM IST
Game in game has 90 percent facts says sona chaudhary

జాతీయ ఫుట్‌బాల్‌ జట్టులో సభ్యురాలిగా ఉన్నప్పుడు.. జట్టులోని క్రీడాకారిణుల పట్ల జరిగిన లైంగిక వేధింపులు, అమానవీయ ఘటనల గురించి సంచలన విషయాలను సోనా చౌదరి వెల్లడించారు. భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన ఆమె.. క్రీడాకారుణులుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తాజా పుస్తకంలో వివరించారు. 'గేమ్ ఇన్ గేమ్‌' పేరిట రాసిన ఈ పుస్తకాన్ని ఇటీవల వారణాసిలో విడుదల చేశారు.టీమ్‌ మేనేజ్‌మెంట్, కోచ్‌, సెక్రటరీ ఇలా ప్రతి ఒక్కరూ తమను లైంగిక వేధించేవారని, జట్టులోని ప్రతి క్రీడాకారిణికి ఈ వేధింపులు తప్పేవి కావని సోనా చౌదరి తన పుస్తకంలో తెలిపారు. 

తాను జాతీయ జట్టులో క్రియాశీలంగా ఉన్న రోజుల్లో తమపట్ల అమానవీయ ఘటనలు జరిగేవని వివరించారు.  జట్టులో స్థానం కోసం క్రీడాకారిణులను లోబర్చుకునేందుకు మేనేజ్‌మెంట్ సిబ్బంది ప్రయత్నించేవారని, నిత్యకృత్యంగా జరిగే ఈ లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి క్రీడాకారుణులు తాము లెస్బియన్‌ తరహాలో వ్యవహరించేవారని ఆమె వివరించారు.ఒక్క జాతీయ జట్టులో మాత్రమే కాదు.. రాష్ట్రస్థాయిలోనూ, ఇతర స్థాయిల్లోనూ మహిళా ఆటగాళ్లపై లైంగిక వేధింపులు జరిగేవని, అలాంటివాటికి రాజీపడలేక వారు మానసిక క్షోభకు గురయ్యేవారని పేర్కొన్నారు.

 విదేశీ పర్యటనల సందర్భంలో కోచ్‌లు, స్టాఫ్‌ సభ్యుల బెడ్‌లను మహిళా ఆటగాళ్ల గదిలో ఉంచేవారని, దీని గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవాళ్లు కాదని ఆమె వెల్లడించారు.1998లో ఆసియా కప్‌ మ్యాచ్‌ సందర్భంగా సోనా చౌదరి మోకాలికి, వెన్నెముకకు గాయం కావడంతో ఆమె కెరీర్ అర్ధంతరంగా ముగిసింది. దీంతో ఫుట్‌బాల్ నుంచి రిటైరైన ఆమె ప్రస్తుతం వారణాసిలో ఉంటున్నారు. ఆమె తాజా పుస్తకంలో చేసిన ఆరోపణలపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి సరబానంద్ సోనోవాల్ స్పందించారు. ఈ ఆరోపణలపై ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : football  indian women captain  sexual harassment  sona chaudhary  

Other Articles